రక్తదానం చేద్దాం కొత్త జీవితాన్ని ఇద్దాం... Swami Vivekananda స్వామి వివేకానంద స్వామి వివేకానంద
Showing posts with label జన్మ సార్ధకత. Show all posts
Showing posts with label జన్మ సార్ధకత. Show all posts

Tuesday, August 26, 2014

జన్మ సార్ధకత

         మనిషిగా పుట్టడం, చావడం, కూటి కోసం కష్టపడడం జీవతం అంత కూడా, జీవితం అంటే ఇదేనాప్రతి ఒక్కరం కూడా ఇదే ప్రశ్నవేసుకున్నటైతే జవాబు మనకే తెలుస్తుంది. మనిషిగా పుట్టిన తర్వాత ఈ మనవ జన్మ కు సార్ధకత అంటూ ఉండాలి. దానికి మనం చేయవలిసినవి చాల ఉన్నాయి, ఆత్మా విశ్వాసాన్ని ఏ మాత్రం సడలనివ్వకూడదు , మనిషిని ముందుకు నడిపేదే ఆత్మా విశ్వాసం. ప్రతి మనిషికి లక్ష్యం అనేది ఉండాలి. ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే మనిషి లక్ష్యం వైపు ప్రయాణం సాగించాలి. మనిషిని మనిషిగా నిలిపేదే మనస్సు. మనస్సు అనేది మనకు రెండు సంకేతాలను పంపుతుంది, అవి ఏమిటంటే మంచి, చెడు అయితే మనం ఎక్కువ చేడుకే ఆకర్షితులం అవుతాం. దానికి కారణం మంచి అనేది కష్టంగాను చెడు అనేది సుఖం గాను కనపడుతుంది. మనం మంచిని మాత్రమే స్వీకరించాలి, (ఉదా: హంస పాలు, నీళ్ళు రెండు కలిసి ఉన్నప్పటికీ పాలను మాత్రమే స్వీకరిస్తుంది, నీరును వదిలేస్తుంది.) మనం కూడా హంసను ఆదర్శంగా చేసుకుని మంచిని స్వీకరించి చెడును వదిలిపెట్టాలి. సమాజంలో మనకంటూ ఒక ఉన్నత స్ధానాన్ని సంపాదించుకోవాలి, మనం సంపాదించుకున్న ఉన్నత స్ధానంలో ప్రజా సేవ చేసుకుంటూ మనం ఎదుటి వారికీ ఆదర్శం కావాలి. మానవ జీవితానికి ఎన్నో ఓడిదిడుకులు వస్తాయి. కానీ వాటిని ఎదిరించి పోరాడి గెలవడమే జీవితం. కష్ట సుఖాలను చిరునవ్వుతో ఆహ్వానించేవాడే, జీవితంలో పైకి రాగలడు. ఎవరి వలనో నా జీవితం ఇలా తయారైంది, అనుకోవడం అవివేకం. భాదపడడం కంటే మనోధైర్యాన్ని పెంచుకుని, నేను ఏదైనా సాదించగలను అనే భావం ముందు మనం ఏర్పరుచు కోవాలి. 
              మనం ఎంత సంపాదించినా, కూడా పట్టుకేల్లది ఏమిలేదు. మనం బ్రతికి ఉన్నత కాలం, మనం చేసిన మంచి పనులు, పేరు ప్రఖ్యాతలను మాత్రమే తీసుకెళ్ళగలం. మనం ఎవ్వరికి మంచి చేయక పోయిన పర్వాలేదు, ఎట్టి పరిస్దితులలోను  చెడు మాత్రం చేయకూడదు. మనకి సహాయం చేసిన వారిని ఎప్పటికి మరువకూడదు. ప్రస్తుతం మనకి ఆదర్శంగా స్వామి వివేకానంద ను చెప్పవచ్చు. ఆయన చెప్పిన ప్రసంగాలు, విదేశియులను ఎంతగా ఆకట్టు కున్నాయో మనకు తెలుసు. 
               " లెమ్ము !  ధైర్యవంతుడవై, బలవంతుడవై, మనసు నిలుపుము. భాద్యతను అంతయు నీ మీదనే పెట్టుకొనుము మరియు నీ విధికి నీవే కారణమని తెలుసుకో. నీకు కావాల్సిన బలమంతా, సహాయమంత నీయందే కలదు.కాబట్టి భవిష్యతును నీవే నిర్మించుకోనుము" 
                                                                           - స్వామి వివేకానంద 


              ఎంత చక్కగా చెప్పారు, విదేశాలు వెళ్లి అక్కడ స్వామి వివేకానంద "ప్రియమైన సోదర సోదరీమనులార!" అని సంబోధించడం వాళ్ళ మన భారత దేశ సంస్కృతి విదేశాలలో మారుమ్రోగింది. 
              మనకు మనమే ఏదో ఉహించుకుని నేను చేత కాని వాడిని అని అనుకోవడాన్ని "ఆత్మదూషణ" అంటారు. నేను ఏదైనా సాదించగలను అనే నమ్మకం ఉండాలి. నమ్మకం లేనిదే మనిషి జీవితమే లేదు. నమ్మకం అనేది మనిషికి శ్వాస వంటిది, సుఖ దు:ఖలనేవి  రాత్రి పగలు వంటివి. ఈ రెండు సహజం. మనిషికి ఆధ్యాత్మికం (దైవచింతన) ఉండాలి. అది లేని నాడు మానవులు భయం భక్తీ లేకుండా విచ్చలవిడిగా వారి ఇష్టం వచ్చినట్లు సంచరిస్తారు. ఏ మతమైనప్పటికి మంచినే బోదిస్తుంది తప్ప చెడును భోదించదు. సర్వమతాల ఇక్యతతో జన్మ సార్ధకత తెలుసుకున్నారని ఆశిస్తూ...
                                                                                         --స్ఫూర్తి