Thursday, September 11, 2014

విద్యార్ధులకు కెరీర్ పై అవగాహన సదస్సు

 ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్దుల బావిష్యత్  ప్రణాళికను ముందుగా ప్లాన్ చేసుకునే కెరీర్ పై అవగాహనా కార్యక్రమాన్ని స్నేహహస్తం   స్వచ్చంద సేవ  సంస్థ ఆద్వర్యం లో కాజులూరు లో జరిగింది. ఈ కార్యక్రమంలో దడల  శ్రీనివాస్,చైతన్య  పలువురు పాల్గొన్నారు
సాక్షి,సూర్య [23/04/2011]

Wednesday, September 10, 2014

అగ్ని భాధితులకు బియ్యం, దుస్తులు, వంట సామగ్రి, కూరగాయలు

కాజులూరు మండలం, బందనపూడి గ్రామ శివారు-ఊట  చెరువు అగ్ని భాధితులకు బియ్యం, దుస్తులు, వంట సామగ్రి, కూరగాయలు అందచేయడం.
ఆంధ్రప్రభ, సూర్య, ప్రజా శక్తి, వార్త [23/09/2010]

కాజులూరు మండలం, దుగుదుర్రు గ్రామ శివారు రెండు కుటుంబాలకు ఆర్దిక సహాయం

పారిశుధ్యం

కాజులూరు శ్రీ రామ్ నగర్ కాలనీలో బ్లీచింగ్ పౌడర్ జల్లడం.
వార్త, ఆంధ్రభూమి, సాక్షి  [13/09/2010]

సునామీ వరదలు, నెల్లూరు జిల్లా

నెల్లూరు జిల్లా సునామీ వరద బాదితులకు 15 టన్నుల బియ్యం, 15,000 రూపాయల నగదును TV9 ద్వారా బాదితులకు అందచేత
వార్తా [22/10/2009] 

Tuesday, August 26, 2014

రక్తదానం చేద్దాం కొత్త జీవితాన్ని ఇద్దాం...


దేశ భక్తి

దేశ భక్తి అంటే జెండా పట్టుకుని నాకు దేశ భక్తి ఎక్కువ అనడం కాదు. దేశ భక్తి అనేది ప్రతి వ్యక్తిలోను ఉంటుంది. కాకపోతే దానిని వెలికితీయాలి. దేశ భక్తి అనేది మనసులోంచి రావాలి. దేశానికి సేవ చేయాలి. ఈ దేశం నాకు ఏమి చేసింది అనడం కాదు. నేను దేశానికి ఏమి చేశాను అన్నది ముఖ్యం. దేశాన్ని కాపాడడానికి ఎక్కడకి వెళ్ళాలి? దానికి ఎక్కడకి వెళ్ళనక్కరలేదు, ఆపదలో ఉన్న వారికీ సేవ చేస్తే, దేశానికి సేవ చేసినట్లే. మనం ఇంత స్వేచ్చగా మనం ఇష్టం వచిన్నట్టు ఉన్నామంటే దానికి కారణం, ఎందరో మహానుభావులు కృషి ఫలితమే. ఎన్నో వేల కుటుంబాలు సహితం దేశార్పణ చేసాయి. అటువంటి ఈ దేశాన్ని మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. నాకు బలం లేదు, శక్తి లేదు దేశాన్ని ఎలా కాపాడను? దేశాన్ని కాపాడడానికి బలం బలగం అవసరం లేదు. ఆత్మస్థైర్యం, పట్టుదల, కృషి ఉంటే చాలు. న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టి ఉంటాయి. ఎందుకంటే అన్యాయాన్ని చూడలేక, ఆ కళ్ళకు గంతలు విప్పే రోజు రావాలి! రావాలంటే న్యాయం, ధర్మం, నీతి అనేవి మనం అస్త్రాలుగా ధరించి అన్యాయాన్ని ఎదిరించాలి. భారతీయ పౌరునిగా మన వంతు భాద్యత నిర్వహించడానికి ప్రతి ఒక్క పౌరుడు ఒక శక్తీవంతుడై వెలుగెత్తి పోరాటం చేయాలి. భారతమాత ఋణం తీర్చుకోవాలి.న్యాయానికి మారుపేరుగా మనమందరం తయారుకావాలి. న్యాయం లో న్యాయ దేవతను, ధర్మం లో ధర్మరాజు ను, సత్యం లో సత్య హరిశ్చంద్రున్నిమించి పోవాలి. మన దేశం కోసం ధన, మాన, ప్రాణాలు సైతం లేక్కచేయకూడదు. మళ్లీ తెల్లదొరల చేతుల్లో మన జీవితాలు నలగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు నడుం బిగించాలి ముందుకు సాగాలి . ప్రజాసేవే దేశసేవ ". భగత్ సింగ్  లాంటి మహాత్ములు పుట్టిన దేశం, రాముడు పరిపాలించిన దేశం, సతి సావిత్రి లాంటి మహా పతివ్రతలకు పుట్టినిల్లు మన భారతదేశం. మన దేశ బాద్యత మనపై  ఆదారపడి ఉంది. మేల్కొనండి! మన దేశం పట్ల భక్తి బావంతో మెలగండి. శివాజీ రాజ తల్లి ఆయనకు ఉగ్గుపాలకు బదులు దేశ భక్తిని నూరి పోసింది. దేశం యందు భక్తి శ్రద్ధలతో మెలుగుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను .
                                                                                            జైహింద్
                                                                                            -స్పూర్తి 

జన్మ సార్ధకత

         మనిషిగా పుట్టడం, చావడం, కూటి కోసం కష్టపడడం జీవతం అంత కూడా, జీవితం అంటే ఇదేనాప్రతి ఒక్కరం కూడా ఇదే ప్రశ్నవేసుకున్నటైతే జవాబు మనకే తెలుస్తుంది. మనిషిగా పుట్టిన తర్వాత ఈ మనవ జన్మ కు సార్ధకత అంటూ ఉండాలి. దానికి మనం చేయవలిసినవి చాల ఉన్నాయి, ఆత్మా విశ్వాసాన్ని ఏ మాత్రం సడలనివ్వకూడదు , మనిషిని ముందుకు నడిపేదే ఆత్మా విశ్వాసం. ప్రతి మనిషికి లక్ష్యం అనేది ఉండాలి. ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే మనిషి లక్ష్యం వైపు ప్రయాణం సాగించాలి. మనిషిని మనిషిగా నిలిపేదే మనస్సు. మనస్సు అనేది మనకు రెండు సంకేతాలను పంపుతుంది, అవి ఏమిటంటే మంచి, చెడు అయితే మనం ఎక్కువ చేడుకే ఆకర్షితులం అవుతాం. దానికి కారణం మంచి అనేది కష్టంగాను చెడు అనేది సుఖం గాను కనపడుతుంది. మనం మంచిని మాత్రమే స్వీకరించాలి, (ఉదా: హంస పాలు, నీళ్ళు రెండు కలిసి ఉన్నప్పటికీ పాలను మాత్రమే స్వీకరిస్తుంది, నీరును వదిలేస్తుంది.) మనం కూడా హంసను ఆదర్శంగా చేసుకుని మంచిని స్వీకరించి చెడును వదిలిపెట్టాలి. సమాజంలో మనకంటూ ఒక ఉన్నత స్ధానాన్ని సంపాదించుకోవాలి, మనం సంపాదించుకున్న ఉన్నత స్ధానంలో ప్రజా సేవ చేసుకుంటూ మనం ఎదుటి వారికీ ఆదర్శం కావాలి. మానవ జీవితానికి ఎన్నో ఓడిదిడుకులు వస్తాయి. కానీ వాటిని ఎదిరించి పోరాడి గెలవడమే జీవితం. కష్ట సుఖాలను చిరునవ్వుతో ఆహ్వానించేవాడే, జీవితంలో పైకి రాగలడు. ఎవరి వలనో నా జీవితం ఇలా తయారైంది, అనుకోవడం అవివేకం. భాదపడడం కంటే మనోధైర్యాన్ని పెంచుకుని, నేను ఏదైనా సాదించగలను అనే భావం ముందు మనం ఏర్పరుచు కోవాలి. 
              మనం ఎంత సంపాదించినా, కూడా పట్టుకేల్లది ఏమిలేదు. మనం బ్రతికి ఉన్నత కాలం, మనం చేసిన మంచి పనులు, పేరు ప్రఖ్యాతలను మాత్రమే తీసుకెళ్ళగలం. మనం ఎవ్వరికి మంచి చేయక పోయిన పర్వాలేదు, ఎట్టి పరిస్దితులలోను  చెడు మాత్రం చేయకూడదు. మనకి సహాయం చేసిన వారిని ఎప్పటికి మరువకూడదు. ప్రస్తుతం మనకి ఆదర్శంగా స్వామి వివేకానంద ను చెప్పవచ్చు. ఆయన చెప్పిన ప్రసంగాలు, విదేశియులను ఎంతగా ఆకట్టు కున్నాయో మనకు తెలుసు. 
               " లెమ్ము !  ధైర్యవంతుడవై, బలవంతుడవై, మనసు నిలుపుము. భాద్యతను అంతయు నీ మీదనే పెట్టుకొనుము మరియు నీ విధికి నీవే కారణమని తెలుసుకో. నీకు కావాల్సిన బలమంతా, సహాయమంత నీయందే కలదు.కాబట్టి భవిష్యతును నీవే నిర్మించుకోనుము" 
                                                                           - స్వామి వివేకానంద 


              ఎంత చక్కగా చెప్పారు, విదేశాలు వెళ్లి అక్కడ స్వామి వివేకానంద "ప్రియమైన సోదర సోదరీమనులార!" అని సంబోధించడం వాళ్ళ మన భారత దేశ సంస్కృతి విదేశాలలో మారుమ్రోగింది. 
              మనకు మనమే ఏదో ఉహించుకుని నేను చేత కాని వాడిని అని అనుకోవడాన్ని "ఆత్మదూషణ" అంటారు. నేను ఏదైనా సాదించగలను అనే నమ్మకం ఉండాలి. నమ్మకం లేనిదే మనిషి జీవితమే లేదు. నమ్మకం అనేది మనిషికి శ్వాస వంటిది, సుఖ దు:ఖలనేవి  రాత్రి పగలు వంటివి. ఈ రెండు సహజం. మనిషికి ఆధ్యాత్మికం (దైవచింతన) ఉండాలి. అది లేని నాడు మానవులు భయం భక్తీ లేకుండా విచ్చలవిడిగా వారి ఇష్టం వచ్చినట్లు సంచరిస్తారు. ఏ మతమైనప్పటికి మంచినే బోదిస్తుంది తప్ప చెడును భోదించదు. సర్వమతాల ఇక్యతతో జన్మ సార్ధకత తెలుసుకున్నారని ఆశిస్తూ...
                                                                                         --స్ఫూర్తి