దేశ భక్తి అంటే జెండా పట్టుకుని నాకు దేశ భక్తి ఎక్కువ అనడం కాదు. దేశ భక్తి అనేది ప్రతి వ్యక్తిలోను ఉంటుంది. కాకపోతే దానిని వెలికితీయాలి. దేశ భక్తి అనేది మనసులోంచి రావాలి. దేశానికి సేవ చేయాలి. ఈ దేశం నాకు ఏమి చేసింది అనడం కాదు. నేను దేశానికి ఏమి చేశాను అన్నది ముఖ్యం. దేశాన్ని కాపాడడానికి ఎక్కడకి వెళ్ళాలి? దానికి ఎక్కడకి వెళ్ళనక్కరలేదు, ఆపదలో ఉన్న వారికీ సేవ చేస్తే, దేశానికి సేవ చేసినట్లే. మనం ఇంత స్వేచ్చగా మనం ఇష్టం వచిన్నట్టు ఉన్నామంటే దానికి కారణం, ఎందరో మహానుభావులు కృషి ఫలితమే. ఎన్నో వేల కుటుంబాలు సహితం దేశార్పణ చేసాయి. అటువంటి ఈ దేశాన్ని మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. నాకు బలం లేదు, శక్తి లేదు దేశాన్ని ఎలా కాపాడను? దేశాన్ని కాపాడడానికి బలం బలగం అవసరం లేదు. ఆత్మస్థైర్యం, పట్టుదల, కృషి ఉంటే చాలు. న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టి ఉంటాయి. ఎందుకంటే అన్యాయాన్ని చూడలేక, ఆ కళ్ళకు గంతలు విప్పే రోజు రావాలి! రావాలంటే న్యాయం, ధర్మం, నీతి అనేవి మనం అస్త్రాలుగా ధరించి అన్యాయాన్ని ఎదిరించాలి. భారతీయ పౌరునిగా మన వంతు భాద్యత నిర్వహించడానికి ప్రతి ఒక్క పౌరుడు ఒక శక్తీవంతుడై వెలుగెత్తి పోరాటం చేయాలి. భారతమాత ఋణం తీర్చుకోవాలి.న్యాయానికి మారుపేరుగా మనమందరం తయారుకావాలి. న్యాయం లో న్యాయ దేవతను, ధర్మం లో ధర్మరాజు ను, సత్యం లో సత్య హరిశ్చంద్రున్నిమించి పోవాలి. మన దేశం కోసం ధన, మాన, ప్రాణాలు సైతం లేక్కచేయకూడదు. మళ్లీ తెల్లదొరల చేతుల్లో మన జీవితాలు నలగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు నడుం బిగించాలి ముందుకు సాగాలి . ప్రజాసేవే దేశసేవ ". భగత్ సింగ్ లాంటి మహాత్ములు పుట్టిన దేశం, రాముడు పరిపాలించిన దేశం, సతి సావిత్రి లాంటి మహా పతివ్రతలకు పుట్టినిల్లు మన భారతదేశం. మన దేశ బాద్యత మనపై ఆదారపడి ఉంది. మేల్కొనండి! మన దేశం పట్ల భక్తి బావంతో మెలగండి. శివాజీ రాజ తల్లి ఆయనకు ఉగ్గుపాలకు బదులు దేశ భక్తిని నూరి పోసింది. దేశం యందు భక్తి శ్రద్ధలతో మెలుగుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను .
జైహింద్
-స్పూర్తి






