రక్తదానం చేద్దాం కొత్త జీవితాన్ని ఇద్దాం... Swami Vivekananda స్వామి వివేకానంద స్వామి వివేకానంద
Showing posts with label స్వచ్చంద సేవా సంస్ధ. Show all posts
Showing posts with label స్వచ్చంద సేవా సంస్ధ. Show all posts

Friday, October 28, 2011

స్నేహ హస్తం

ప్రపంచ మానవాళికి నా స్నేహపూర్వక నమస్కారాలు.
ప్రతి ఒక్కరికి సమాజ స్పృహ అనేది ఉండాలి, దేశ భవిష్యత్ యువకుల ఫై ఆదారపడి ఉందని, భావి తరాలకు మంచి ఆదర్శ జీవనం గల యువకులను తయారు చేయాలనీ స్వామి వివేకానంద పిలుపునిచ్చారు.
ఆయన యొక్క జీవన గమనాన్ని పుస్తకాల రూపంలో చదివిన నేను, నేను గ్రహించిన విషయాలను మీతో పంచుకోవాలని భావిస్తున్నాను.
        ఏ వ్యక్తి అయితే సమాజాన్ని తన కుటుంబంగా భావించి, తన వ్యక్తిగత జీవితం కూడా లెక్క చేయడో అటువంటి వ్యక్తి మరొక వివేకానంద కావచ్చు.
        ఎదుటి వ్యక్తి నుండి ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతను, మనవాడు అనే భావనను కేవలం స్నేహం ద్వార మాత్రమే పొందగలం. అందరు శారిరిక రుగ్మతలతో భాదాడుతున్నామని భావిస్తుంటారు, అంతే కాకుండా అంగ వైకల్యం గల వ్యక్తులను చూసి జాలి పడతారు, కానీ ఇప్పుడు సమాజంలో శారిరిక రుగ్మతలతోను, అంగ వైకల్యంతోను భాదపడడం లేదు, కేవలం మానసిక రుగ్మతలతో మాత్రమే భాదపడుతున్నారు. మానసిక ఆరోగ్యం గల వ్యక్తీని శారిరిక రుగ్మతలు గాని, ఆర్దిక సమస్యలు కానీ భాదించవు. ఏ వ్యక్తీ అయితే ఆర్ధిక స్వాతంత్ర్యం ఉంటుందో, ఆ వ్యక్తి ఆలోచన విదానం సమాజానికి మేలు చేసే విదంగా ఉంటుంది.



                                                                       -- జగన్ (ఫౌండర్  &  చైర్మన్) 
                                                                             స్నేహ హస్తం స్వచ్చంద సేవా సంస్ధ