రక్తదానం చేద్దాం కొత్త జీవితాన్ని ఇద్దాం... Swami Vivekananda స్వామి వివేకానంద స్వామి వివేకానంద

Tuesday, May 14, 2013

తెలుగువెలుగు

  సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు మన భారతదేశం.  ప్రపంచ దేశాలకు సంప్రదాయ వెలుగు రేఖలను ప్రసరిస్తూ ప్రపంచానికే ఆదర్శవంతమైన దేశంగా విరాజిల్లుతున్న ఆధ్యాత్మిక దేశం మన భారత దేశం.భారతీయ సోదర యువకులారా ! ఎటుపోతుంది మన తరం  ప్రాశ్చత్యదేశల  మోజులో మన దేశ సంస్కృతి  సంప్రదాయాలను విస్మరిస్తునమేమో అలోచిచండి? నాగరికత పేరుతో మన తల్లి భారతమాతను మరువద్దు. "దేశ భాషలందు తెలుగు లెస్స" అన్న శ్రీ కృష్ణ దేవరాయుల మాట మరువుగలమా? తెలుగు వారైనా మనమందరం కమ్మనైన తెలుగు బాష  సౌరభాలను ప్రసరిద్దాం,తెలుగు జాతికి పునర్వైభవం తీసుకోద్దాం. భారతమాత ముద్దు బిడ్డలమై దేశ ఖ్యాతిని సువర్ణ అక్షరాలతో లిఖిద్దాం. అమ్మచేతి గొరుముద్ద  తెలుగుబాష వెలుగుగడ్డ. 



                                                                                                                                ధన్యవాదములతో ... 
                                                                                                                                     మీ  జగన్                                                                                                    

Tuesday, August 21, 2012

అన్నదానం

                     అన్ని దానలలోను ఉన్నతమైన దానం అన్నదానం. ఆకలితో అలమటిస్తున్న పేదవారు ఎంతో మంది మనకు కనిపిస్తుంటారు. అలాంటి వారికీ పట్టేడన్నం పెట్టె కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది స్నేహహస్తం స్వచ్చంద సేవా సంస్ద. మీ ఇళ్ళలో జరిగే వివాహాది శుభకార్యాలలో మిగిలిపోయే ఆహార పదార్దలను బయట పడవేయడం జరుగుతుంది.అలా  పడవేయడం  వల్ల  ఎవరికి  ఉపయోగ పడదు .అంతే  కాకుండా  డబ్బు కూడా  వృధా అవుతుంది.  కాబట్టి   కాజులూరు మండలం లో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగిన  మిగిలిపోయిన ఆహార పదార్దాలను దయచేసి 99 51 71 61 98 ఈ నెంబర్ కు ఫోన్ చేస్తే వెంటనే వచ్చి ఆ ఆహార పదార్దాలను ఆకలితో అలమటిస్తున్న  పేదలకు పంచిపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మీ అందరి సహకారం కోరుతూ .....
Mee Jagan
 
మీ 
  జగన్ 
ఫౌండర్  & చైర్మన్ 
  

Friday, October 28, 2011

స్నేహ హస్తం

ప్రపంచ మానవాళికి నా స్నేహపూర్వక నమస్కారాలు.
ప్రతి ఒక్కరికి సమాజ స్పృహ అనేది ఉండాలి, దేశ భవిష్యత్ యువకుల ఫై ఆదారపడి ఉందని, భావి తరాలకు మంచి ఆదర్శ జీవనం గల యువకులను తయారు చేయాలనీ స్వామి వివేకానంద పిలుపునిచ్చారు.
ఆయన యొక్క జీవన గమనాన్ని పుస్తకాల రూపంలో చదివిన నేను, నేను గ్రహించిన విషయాలను మీతో పంచుకోవాలని భావిస్తున్నాను.
        ఏ వ్యక్తి అయితే సమాజాన్ని తన కుటుంబంగా భావించి, తన వ్యక్తిగత జీవితం కూడా లెక్క చేయడో అటువంటి వ్యక్తి మరొక వివేకానంద కావచ్చు.
        ఎదుటి వ్యక్తి నుండి ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతను, మనవాడు అనే భావనను కేవలం స్నేహం ద్వార మాత్రమే పొందగలం. అందరు శారిరిక రుగ్మతలతో భాదాడుతున్నామని భావిస్తుంటారు, అంతే కాకుండా అంగ వైకల్యం గల వ్యక్తులను చూసి జాలి పడతారు, కానీ ఇప్పుడు సమాజంలో శారిరిక రుగ్మతలతోను, అంగ వైకల్యంతోను భాదపడడం లేదు, కేవలం మానసిక రుగ్మతలతో మాత్రమే భాదపడుతున్నారు. మానసిక ఆరోగ్యం గల వ్యక్తీని శారిరిక రుగ్మతలు గాని, ఆర్దిక సమస్యలు కానీ భాదించవు. ఏ వ్యక్తీ అయితే ఆర్ధిక స్వాతంత్ర్యం ఉంటుందో, ఆ వ్యక్తి ఆలోచన విదానం సమాజానికి మేలు చేసే విదంగా ఉంటుంది.



                                                                       -- జగన్ (ఫౌండర్  &  చైర్మన్) 
                                                                             స్నేహ హస్తం స్వచ్చంద సేవా సంస్ధ